Site icon Prime9

#Love Today: లవర్స్ ఒక్కరోజు ఫోన్ మార్చుకుంటే ఎలా ఉంటుందో “లవ్ టుడే” ట్రైలర్లో చూసెయ్యండి

love-today-to-stream-on-netflix-from-december-2

love-today-to-stream-on-netflix-from-december-2

#Love Today: ఇప్పుడు దర్శకులే హీరోగా నటిస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాంతార చిత్రంలో రిషబ్ శెట్టినే దర్శకుడిగా మరియు హీరోగా అద్భుతంగా రాణించి ప్రజలను మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న లవ్ టుడే చిత్రాన్ని కూడా తమిళ దర్శుకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ ప్రేక్షకులముందు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాను తెలుగులోనూ అదే టైటిల్ తో నిర్మాత దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

లవ్ టుడే సినిమా ట్రైలర్‌ ని విడుదల చేసింది దిల్ రాజు టీమ్. ఈ ట్రైలర్ విడుదలతోనే మంచి సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలిస్తోంది. తమిళంలో నవంబర్ 4న విడుదలై బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ మూవీ. అయితే తెలుగులో ఎప్పుడు ఈ సినిమా విడుదల చేయనున్నారనేది ఇంకా క్లారిటీ లేదు.

కాగా ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో సత్యరాజ్‌, రాధికా శరత్‌ కుమార్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: ఇతడే నా భర్త.. పెళ్లి రూమర్స్ పై తమన్నా స్ట్రాంగ్ కౌంటర్

Exit mobile version