Site icon Prime9

Masooda: ‘మసూద’ నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

Masooda

Masooda

Tollywood: మళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.

నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దిల్ రాజు యాంకర్‌గా వ్యవహరించి, సినిమాకు పనిచేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ ని కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు దిల్ రాజు. చిత్రం మంచి విజయాన్ని సాధించినందుకు యూనిట్ ను అభినందించారు.

 

Exit mobile version