Site icon Prime9

Daggubati Family in Srivari Seva: శ్రీవారి సేవలో దగ్గుబాటి కుటుంబం

Daggubati Family in Srivari Seva

Daggubati Family in Srivari Seva

Tirumala: నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు. తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం మూలవిరాట్టును దర్శించుకొన్నారు. తితిదే అధికారులు ప్రత్యేక దర్శనంతోపాటుగా లడ్డూ ప్రసాదాలు స్వామి వారి ప్రసాదంగా ఇరువురికి అందచేశారు.

మరోవైపు తమిళనాడుకు చెందిన కరూర్ వైశ్యా బ్యాంకు యాజమాన్యం టిటిడీకి 30లక్షల రూపాయలు విలువ చేసే 5 బ్యాటరీ వాహనాలను అందచేసింది. వాహనాలకు పూజలు నిర్వహించిన తర్వాత బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ బాబు చేతలమీదుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వాహనాల తాళాలను అందజేశారు.

విఐపీల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో సామాన్య భక్తులకు సైతం ఏడుకొండలవాని దర్శన భాగ్యాన్ని త్వరితగతిన కల్పిస్తున్నారు.

Exit mobile version