Site icon Prime9

Chinmayi Sripaada: ప్రపంచంలో ఇంత కంటే గొప్ప ఫీలింగ్ ఇంకోటి ఉండదేమో అంటున్న చిన్మయి!

chinmayi prime9news

chinmayi prime9news

Tollywood: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆమె పాటలు, డబ్బింగ్, వాయిస్ ఇలా అన్నింటితోనూ ఆమె భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే వీటి కన్నా మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాటమే ఆమెను బాగా పాపులర్ చేసింది. కోలీవుడ్‌లో ఈమెను అందరూ శత్రువులా చూస్తారు.

సింగర్ చిన్మయి అనగానే ఫైర్ బ్రాండ్ అన్న ట్యాగ్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తుకు ఎదురుగా నిలిచింది. తనపై చిన్నతనంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని వైరముత్తు మీద ఆరోపణలు చేసింది. వైరముత్తు తనని మాత్రమే కాదని ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలతో నాశనం చేశారని ఆరోపించింది. ఈమె వైరాముత్తుతోనే ఆగకుండా సింగర్ కార్తీక్ నిజస్వరూపాన్ని కూడా చిన్మయి బయట పెట్టేసింది.

సింగర్ కార్తీక్  కు అమ్మాయిల పిచ్చి ఉందని, తన వద్దకు వచ్చిన అమ్మాయిలను కార్తీక్ ఎలా వాడుకుంటాడో బయటి ప్రపంచానికి చెప్పింది. అలా సింగర్ చిన్మయి అందరికీ శత్రువైంది. కానీ సమాజంలో మాత్రం మంచి పేరును తెచ్చుకుంది. ఇప్పుడు చిన్మయి ఆడవాళ్లందరికీ ఆదర్శంగా ఉంది. ఆడవాళ్లకు ఏ కష్టాలు వచ్చినా చిన్మయితో పంచుకుంటారు. బాధను తీర్చుకుంటారు. అలా చిన్మయి సోషల్ మీడియాలో ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది.

చిన్మయి 2022 జూలై 22న కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో చిన్మయి, రాహుల్ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళకు ద్రిప్తా, శర్వాస్ అనే పేర్లు కూడా పెట్టేశారు. అయితే ఇప్పుడు చిన్మయి తన పిల్లలకు పాలు ఇస్తూ ఆనందంలో మునిగిపోతోంది. తన మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఇంత కంటే గొప్ప ఫీలింగ్ ఇంకోటి ఉండదేమో అన్నట్టుగా చిన్మయి చెప్పుకొచ్చింది.

 

Exit mobile version