Site icon Prime9

Boyapati Srinu: ఐటెం సాంగ్ కోసం మిస్ ఇండియాను తీసుకున్న బోయపాటి శ్రీను

Boyapati Srinu

Boyapati Srinu

Tollywood: ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ కు ఉన్న ప్రాధాన్యత చెప్పనక్కరలేదు. ప్రతీ సినిమాలోనూ ఇది తప్పనిసరిగా ఉండాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పుష్ప సినిమాలో సమంత చేసిన “ఊ అంటావా” అనే ఐటెమ్ సాంగ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరే ఇతర ఐటెం సాంగ్ కు రాని ఫేమ్ ఈ సాంగ్ కు వచ్చింది.

దర్శకుడు బోయపాటి శ్రీను తన చిత్రాలలో ఐటెం సాంగ్ పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. తులసిలోని చికు చికు బండి నుండి వినయ విధేయ రామలోని ఏక్ బార్ వరకు మనం వీటిని చూడవచ్చు. ఈ పాటలకోసం బోయపాటి స్టార్ హీరోయిన్‌లను సెలక్ట్ చేసుకుంటారు. ఆయన సినిమాల్లో శ్రియ, అంజలి, కేథరిన్, హంసా నందిని, ఈషా గుప్తా ఐటెం సాంగ్స్ చేశారు.

రామ్ పోతినేనితో తన రాబోయే చిత్రం కోసం, ఇప్పుడు బోయపాటి శ్రీను మిస్ ఇండియా విజేత ఊర్వశి రౌతేలాను తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ నటి దక్షిణాదిన కేవలం ఐటెం సాంగ్ ల కోసం మాత్రమే వప్పుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ ముద్దుగుమ్మ పై ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరి సినిమా విడుదలయితేనే ఈ సాంగ్ కిక్కిచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది.

Exit mobile version