Site icon Prime9

Rashmi Gautam: యాంకర్ రష్మీకు ఉన్నంత పొగరు ఎవరికి ఉండదంటున్న హీరో నందు

nandu prime9news

nandu prime9news

Tollywood: యాంకర్ రష్మీ గౌతమ్, గీతా మాధురి భర్త నందు కలిసి జంటగా నటించిన సినిమా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. గత రెండేళ్లు నుంచి ఈ సినిమా ఒక కొలుక్కి రాలేదు. మొత్తానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మాసీ లుక్కులో కనిపించడం, రష్మీ గౌతమ్ లుక్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించడం, పాటలు, మాటలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇది వరకు వదిలిన టీజర్, పాటలు అన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వార్తల్లో నిలిచింది. నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.అందుకే ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టరాట. కానీ రష్మీ మాత్రం ప్రమోషన్స్ కు సహకరించడం లేదట. ఫోన్లు చేస్తున్న ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న ప్లేస్ కు వెళ్ళి రచ్చ రచ్చ చేశారు.

అసలు తను ఎందుకు ప్రమోషన్లకు రావడం లేదు, ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదని నిలదీశారు. నేను రాను, నాకు ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు అంటూ ఇలా వారితో వాధించింది. ఐతే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ల కోసం చేస్తోన్న స్టంట్లే అని మనకు అర్థమవుతూనే ఉంది. ఐతే చివరకు అంతా కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను ఈ విధంగా ప్రమోట్ చేశారు. నవంబర్ 4న ఈ సినిమా రాబోతోందంటూ రష్మీ సంబరపడిపోయింది.

Exit mobile version