Site icon Prime9

Bomma Blockbuster: యాంకర్ రష్మి సినిమాకు ‘A’ సర్టిఫికెట్

nandu prime9news

nandu prime9news

Tollywood: బుల్లితెర యాంకర్‌గా తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా పాపులర్ ఐనా రష్మి గౌతమ్ హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’.ఈ సినిమాలో గీతామాధురి భర్త నందు హీరోగా నటించగా, ఈ సినిమా ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ సంయుక్తంగా కలిసి ఈ కినిమను నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేపించుకుంది. ముఖ్యంగా రష్మి అభిమానులు ఐతే చెప్పాలిసిన అవసరమే లేదు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంగళవారం ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.

‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా అంతా పక్కా పల్లెటూరి వాతావరణంలో తీశారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయని ఈ సినిమా యూనిట్ వెల్లడించింది.

Exit mobile version