Bellamkonda Srinivas: అల్లుడు శీను, జయజనకి నాయక, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాల ద్వారా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. కాగా ఈ బెల్లంకొండ హీరోకి బాలీవుడ్ ఫిదా అయ్యింది. జయజానకి నాయక సినిమాను బాలీవుడ్ ఎంతగానో ఆదరించి బ్లాక్ బాస్టర్ హిట్ చేసింది. దానితో ప్రభాస్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఛత్రపతి సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నాడు. ఈనెల 12న ఈ సినిమా హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ మూవీప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
అవన్నీ రూమర్స్(Bellamkonda Srinivas)..
ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా నేషనల్ క్రష్ రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇటీవల కాలంలో రెండు మూడు సార్లు ఎయిర్ పోర్టులో బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక కలిసి కనిపించారు. ఇద్దరు కలిసి రావడం, కలిసి వెళ్లడంతో పాటుగా ఓ బాలీవుడ్ అవార్డు వేడుకలో ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపించడంతో బాలీవుడ్ మీడియా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ వార్తలు రాశారు. తాజాగా ఛత్రపతి సినిమా ప్రమోషన్స్ భాగంగా మీడియా దీనిపై హీరో శ్రీనివాస్ ను ప్రశ్నించగా దానికి బెల్లంకొండ క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం ప్రేమలో, డేటింగ్ లో ఉన్నామంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని.. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన సమాధానమిచ్చారు.
మేమిద్దరం హైదరాబాద్ లోనే ఉండేది. రెగ్యులర్ గా ముంబైకి షూటింగ్ కి వస్తున్నాం. అలా వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా కలుసుకున్నాం. అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాస్తారా? ఆవన్నీ రూమర్స్ మాత్రమే అని బెల్లంకొండ హీరో కొట్టిపడేశారు. దీంతో రష్మికతో బెల్లంకొండ డేటింగ్ పై క్లారిటీ వచ్చేసింది. దేవరకొండ సేఫ్ అంటూ కొందరు అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.
ఎందుకంటే విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ అని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అభిమానులు సైతం ఎప్పట్నుంచో వీరిపై వార్తలు స్ప్రెడ్ చేస్తూన్న వీరి రిలేషన్ ఏంటో ఇప్పటికి క్లారిటీ రాలేదు. మరి చూడాలి ఎప్పుడు వీరు ఓపెన్ అవుతారు అనేది.