Site icon Prime9

Anushka: అన్వితగా మారిన అనుష్క

anushka-shetty-acting as a anvitha ravali shetty role- in-her-upcoming-film

anushka-shetty-acting as a anvitha ravali shetty role- in-her-upcoming-film

Anushka: అనుష్క శెట్టి ఈ పేరంటూ పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటన అందంతో ప్రత్యేక ఫ్యాన్ ఏర్పాటు చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ఈమె ఎప్పుడు ఏం చేస్తుంటారా అనే ఆసక్తి సినీలవర్స్ లో కనిపిస్తూ ఉంటుందో. టాలీవుడ్ నాట బిగ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకుంది ఈ స్వీటీ. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ తార గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కనిపించకపోవడంతో ఈమె అభిమానులు ఒకింత నిరాశకులోనయ్యారు. కాగా తాజా ఈ స్వీటీ బ్యూటీ మళ్లీ తెరపై కనిపించనుంది.

అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తోంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి టాలీవుడ్ జేజెమ్మగా పేరొంది.. ‘బాహుబలి దేవసేనగా’ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది. మహేష్.పి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా అనుష్కకు ఇది 48వ చిత్రం. ‘మిర్చి’, ‘భాగమతి’ విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న మరో చిత్రం ఇదే. ఇకపోతే ఈ మూవీలో స్వీటీ సరికొత్త లుక్ లో కనిపించనుందంటూ అనుష్క పుట్టినరోజు (నవంబర్ 7) సందర్భంగా చిత్ర బృందం స్వీటీకి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేసి ప్రత్యేక విషెష్ తెలిపింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ పోస్టర్ లో అనుష్క చెఫ్ గెటప్ లో వంట చేస్తూ కనిపించింది. సినిమాలో ఆమె “అన్విత రవళి శెట్టి” అనే పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం, వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: మ్యూజిక్ మ్యాజిక్ క్రియేట్ చేసిన హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో

 

Exit mobile version