Site icon Prime9

Jayakrishna As Hero: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో

Hero

Hero

Tollywood: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నవంబర్ 16న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. గురువారం ఆయన 3వ రోజు కార్యక్రమం కూడా జరిగింది. దీనికి కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తాతయ్య 3వ రోజు వేడుకలకు హాజరైన రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒకరిద్దరు నిర్మాతలు మరియు దర్శకులు జయకృష్ణ పై దృష్టి సారించారు, మహేష్ త్వరలో తన అన్న కొడుకును హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారా అని తెలుసుకోవాలనుకున్నారు.

జయకృష్ణ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అయితే తన అన్న కొడుకు వెండితెర పైకి రావడానికి మహేష్ పక్కా ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు తరువాత ఆ ఫ్యామిలీ నుంచి అతని మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మరి జయకృష్ణ ఎంట్రీకి ఇంకా సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. అయితే లేటయినా కానీ అతని ఎంట్రీ పక్కా అని చెప్పవచ్చు

Exit mobile version