Site icon Prime9

Pushpa The Rise: మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ’పుష్ప‘ స్క్రీనింగ్

Pushpa-screened-at-Moscow-Film-Festival

Tollywood: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ విడుదలై ఏడాది అవుతున్నా ఇంకా వార్తల్లోనిలుస్తోంది. ఇటీవలే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికపై సందడి చేసింది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘బ్లాక్ బస్టర్స్’ కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అల్లు అర్జున్ పోస్టర్‌ను షేర్ చేసిఇలా వ్రాసింది ‘పుష్ప – ది రైజ్: పార్ట్ 1’ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘బ్లాక్ బస్టర్ హిట్స్’ కేటగిరీలో ఎంపిక చేసినందుకు మేము సంతోషిస్తున్నాము. “సుకుమార్ బండ్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న నటించిన ‘పుష్ప-ది రైజ్: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021 సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది” అని రాయబార కార్యాలయం వారి ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.

థియేట్రికల్ విడుదలకు ముందు ఎటువంటి మార్కెటింగ్ మరియు ప్రమోషన్లు లేకుండా విడుదలయిన పుష్ప బాక్స్-ఆఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించింది. హిందీబెల్ట్ లో ఈ చిత్రం జోరు చూసి అంతా షాకయ్యారు. బాలీవుడ్ తారలు, కేంద్రమంత్రులు, క్రికెటర్లు అందరూ ఈ చిత్రం డైలాగులు చెప్పారంటే ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలుస్తోంది.

 

Exit mobile version