Site icon Prime9

Agent Movie: “ఏజెంట్” మూవీ మేకింగ్ వీడియోలో అదిరిపోయే స్టంట్స్.. లుక్ మార్చిన అఖిల్

akhil akkineni-agent-movie-making-video

akhil akkineni-agent-movie-making-video

 Agent Movie: అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 9 ఏళ్లు అవుతున్నా.. అతడికి సరైన మాసివ్ హిట్ పడలేదనే చెప్పాలి. 2021లో పూజా హెగ్డేతో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అతడి స్టారడమ్‌ను మాత్రం పెంచలేదనే చెప్పాలి. దానితో తన తదుపరి సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలని ఎంతో ఆశగా ఉన్నాడు అఖిల్. ఈ తరుణంలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు మరో సినిమాతో రానున్నాడు. సురేందర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియోను చూస్తే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం మూవీ టీం ఏ విధంగా కష్టపడ్డారనేది ఈ వీడియో ద్వారా చూపించారు. అంతేకాకుండా ఈ మూవీలో అఖిల్ స్టంట్లు ప్రేక్షకులను మస్త్ ఖుషీ చేస్తున్నాయి. ఇందులో అఖిల్ లుక్ సూపర్ స్ట్రైలిష్‌గా ఉండటమే కాకుండా.. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అయ్యేలా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ పవర్ ప్యాక్‌గా ఈ సినిమా రాబోతున్నట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఏజెంట్ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖిల్ యాక్షన్ సన్నివేశాలు, స్టైల్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

ఏజెంట్ సినిమాలో స్టంట్లు చూస్తుంటే హాలీవుడ్ చిత్రాలను తలపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీలో అఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version