Site icon Prime9

Rajayogam: “రాజయోగం” మూవీ ప్రేక్షకులకు ఫుల్ జోష్.. టీజర్ లాంఛ్ లో నటుడు విశ్వక్ సేన్

Actor Vishwak Sen released the teaser of Rajayogam

Tollywood: “రాజయోగం” మూవీ ప్రేక్షకులకు ఫుల్ జోష్ తెప్పిస్తుందని మాస్ కా దాస్ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను ఆయన చేతులమీదుగా హైదరాబాదులో విడుదల చేశారు. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై తలపెట్టిన “రాజయోగం” చిత్రంలో సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిలక్ష్మణ్ నిర్మాతగా, రామ్ గణపతి దర్శకత్వంలో తెరపైకి ఎక్కించిన ఈ చిత్రం నిర్మాణంలో ప్రేక్షకులకు ఆహ్లాదకరాన్ని అందించే ప్రయత్నం చేశారు. కుటుంబ సమేతంగా ఇంటిళ్లపాదీ తనివితీరా నవ్వుకొనేలా సినిమాలో హస్యాన్ని పండించారు.

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకొన్న కొంత అలజడికి వారం రోజులు హిమాలయాలకు వెళ్దామని అనుకున్నా. కాని హీరో రోనక్ కు మాటిచ్చిన నేపథ్యంలో టీజర్ విడుదలకు వచ్చానన్నారు. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్ గా ఉన్నారు. పాటలు బాగున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పారు.

ఇంతకుముందు ఆయన మలయాళ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అరుణ్ మురళీధరన్ ఆల్బమ్ సినిమా హిట్టుకు కీలకం కానుంది. కాగ, తెలుగు సినిమాకు ఆయన అందిస్తున్న తొలి సంగీత చిత్రం “రాజయోగం”. హీరోయిన్ అంకిత సాహుకు టాలీవుడ్ లోకి అడుగుబెట్టేందుకు దర్శకుడు రామ్ గణపతి ఓ చక్కని అవకాశం ఆమెకు అందించారు. కేరళ కుట్టి బిస్మనాస్ ను చిత్రంలో కొంగొత్తగా చూపించే ప్రయత్నాన్ని చేశారు. ఆమెకు తెలుగులో తొలి సినిమా కావడంతో తమ నటనతో అందరిని అలరించనున్నారు.

రొమాంటిక్, కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఎవరూ ఊహించని విధంగా యువతను కైపెక్కించేలా చిత్రంలో 100 నుంచి 150 లిప్ లాక్ సీన్స్ వారిని కట్టిపడేయనున్నాయి. సినిమా ఫస్టాఫ్ లో ఓ లిఫ్ సీన్ మిస్ కావొద్దని సినిమాకు ముందుగానే క్రేజీ కల్పించారు. హీరో సాయి రోనక్ మాస్ క్యారెక్టర్ తో అదరతీశాడు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ హైలెట్ చేస్తూ చేపట్టిన “రాజయోగం” పడిందే అనే ఒక స్పెషల్ సాంగ్ కు ఎంఎం శ్రీలేఖ కంపోజ్ చేశారు. ధియేటర్ లో ఈ పాట పెద్ద అదరగొట్టనుంది. అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Samantha: సమంత డెడికేషన్ కు హ్యట్సాఫ్.. “యశోద” చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

Exit mobile version