Site icon Prime9

Allur Sirish: సహజీవనం.. ఆపై పెండ్లి బహు భేష్.. నటుడు అల్లు శిరీష్

Actor Allu Sirish said that it would be better to live together and then get married

Tollywood: దాంపత్య వివాహం పై నటుడు అల్లు శిరీష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సహజీవనం చేసిన తర్వాతే పెండ్లి చేసుకొంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఊర్వశివో రాక్షసివో చిత్రం విడుదలై హిట్ టాక్ తెచ్చుకొన్న నేపథ్యంలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో నటుడు శిరీష్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మెగా కుటుంబానికి చెందిన అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత ఓ హిట్ టాక్ ను తెచ్చుకొన్నాడు. సిని ఇండస్ట్రీలోకి అడుగెట్టిన చాలా కాలం అయిన్నప్పటికీ శిరీష్ సరైన హిట్ అందుకోలేకపోయారు. తాజాగా ఆయన నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నిన్నటిదినం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈవెంట్ లో శిరీష్ పాల్గొన్నారు.

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలోని ముద్దు దృశ్యాల్లో ఎక్కడ హద్దులు దాటలేదని హీరో అల్లు శిరీష్ తెలిపాడు. ఈ సినిమాలో ప్రేమ, సహజీవనం, పెళ్లి అంశాల్ని చర్చించామన్నాడు. వివాహ వ్యవస్థ పై తనకు బలమైన విశ్వాసం ఉందని చెప్పాడు. సహజీవనం తర్వాత పెళ్లాడితే బాగుంటుందనేది తన అభిప్రాయం అన్నాడు. తన పెళ్లి విషయంలో ఇంట్లో ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ ఆయన సరసన నటించింది.

ఇది కూడా చదవండి: Rajayogam: “రాజయోగం” మూవీ ప్రేక్షకులకు ఫుల్ జోష్.. టీజర్ లాంఛ్ లో నటుడు విశ్వక్ సేన్

Exit mobile version