Site icon Prime9

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ట్రైలర్ విడుదల

A-Ammayi-Gurinchi-Meeku-Cheppali-Trailer

Tollywood: “నాకు నటన అంటే చాలా ఇష్టం నేను సినిమాలో నటిస్తానంటూ” కృతీ శెట్టి ఫోన్‌లో హీరో సుధీర్ బాబుతో మాట్లాతున్న సన్నీవేశంతో  మొదలవుతుంది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ట్రైలర్‌. సుధీర్‌బాబు, కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఇది గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ మరియు బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు  బి. మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తూన్నారు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సందర్భంగా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా ట్రైలర్‌ను, సోషల్‌ మీడియా వేదికగా సుధీర్ బాబుకు విషెస్ తెలుపుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.

“నేను ఇంక ఎప్పటికీ సినిమాలు చేయలేనేమోనని అనిపిస్తుంది నాకు” అన్న కృతీ డైలాగ్, ‘మనం సినిమా తీస్తున్నామనీ అనుకుంటుంటాం కానీ సినిమానే మనల్ని తీస్తుంది అన్న’ సుధీర్‌బాబు డైలాగ్స్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి పేరు అలేఖ్య, తనకు నటన అంటే చాలా పిచ్చి కానీ వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉండదు ఐనా సరే నటించాలనే అనుకుంటుంది. అలేఖ్య తల్లి తండ్రుల మాటను విన్నదా ? లేక వాళ్ళ మాటని కాదని ఆమె సినిమాలో నటించిందా? అలేఖ్య ఆశ చివరకు ఏమైంది? దీనికి ఆ సినిమా దర్శకుడుగా ఉన్నా సుధీర్‌బాబు ఆ అమ్మాయిని సినిమాలోకి తీసుకుంటాడా ? లేదా అనే అంశాలపై ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ స్వరాలను చేకూరిస్తున్నారు.

 

Exit mobile version