Site icon Prime9

Ileana D’Cruz : ఎట్టకేలకు తన భర్త ని చూపించిన ఇలియానా .. అతను ఎవరో కాదు ..

tollywood-heroin-ileana-dcruz-finally-introduce-her-husband

tollywood-heroin-ileana-dcruz-finally-introduce-her-husband

Ileana D’Cruz : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల ఒక మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే . అయితే ఈమె కనీసం పెళ్ళి మాట చెప్పకుండా ఏకం గా ప్రెగ్నెన్సి సంగతిని చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది . తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూనే వచ్చారు. ఇక ఆ సస్పెన్స్ కి ఇప్పుడు తెరదించారు. తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. రీసెంట్ గా ఇలియానా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే ఆమె తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. ఇంతకీ ఇలియానా పెళ్లాడిన ఆ వ్యక్తి ఎవరు..?

గతంలో ‘డేట్ నైట్’ అంటూ ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను ఈ భామ షేర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పుడు అతనే తన భర్త అని ఆమె నేరుగా చెప్పలేదు. దీంతో ఆ విషయం పై ఒక సస్పెన్స్ అలా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఆ వ్యక్తే తన భర్త అని తెలియజేశారు. మీ సింగల్ పేరెంటింగ్ ఎలా ఉంది..? అని ఒక నెటిజెన్ క్యూస్షన్ చేసిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను సింగల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకి తండ్రి ఎవరు అన్నది తెలియజేశారు. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న క్యూస్షన్ కి ఆన్సర్ దొరికేసినట్లు అయ్యింది.

ఇక ఇదే ఇంటరాక్షన్ మాట్లాడుతూ.. త్వరలోనే మళ్ళీ సినిమాలోకి తిరిగి వస్తానని, ప్రస్తుతం అమ్మగా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాధానాలతో ఆమె అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇలియానా పెళ్లాడిన ఈ వ్యక్తి ఎవరు..? అతను ఏం చేస్తారు..? అనేది మరో ప్రశ్నగా మారింది. కాగా ఇలియానా ఈ ఏడాది మే నెలలో తన ప్రెగ్నెన్సీ అందరికి తెలియజేశారు. ఆగస్టు 1న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి అమ్మగా ప్రమోషన్ అందుకున్నారు. అలాగే అమ్మగా తన భాద్యతని జాగ్రత్త నిర్వర్తిస్తున్నట్టు చెప్పుకొచ్చింది .

Exit mobile version