Prime9

Tollywood: ఏపీ సీఎం చంద్రబాబుతో టాలీవుడ్‌ ప్రముఖుల సమావేశం – ఎప్పుడంటే..

Tollywood Meets AP CM Chandrababu Naidu: ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవనున్నారు. ఆయనతో సమావేశంలోపై థియేటర్ల ఇష్యూతో పాటు మరిన్ని కీలక విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.

 

నిర్మాతలు, హీరోలకు పడటం లేదు. ఒకరిపై ఒకరు ఇన్‌డైరెక్ట్స్‌ విమర్శలు చేసుకుంటున్నారు. థియేటర్ల యాజమాన్యాలు అసహనంతో ఉన్నారు. మల్టీప్లెక్స్‌తో పోలిస్తే సింగిల్‌ స్క్రిన్‌ థియేటర్లు నష్టం జరుగుతుందని, పర్సంటేజీల విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో థియేటర్‌ యాజమాన్యాలు థియేటర్ల బంద్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ టాలీవుడ్‌ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

 

కూటమీ ప్రభుత్వం ఏర్పాటై ఇంతకాలం అవుతున్నా.. ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి మర్యాదగా కలిశారా? అని ప్రశ్నించారు. టికెట్ల రేట్ల కోసం వ్యక్తిగతం కలిసేందుకు టైం ఉన్న మీకు.. సీఎం కలిసేందుకు టైం దొరకడం లేదా? అని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోల విషయంలో ఎవరూ కూడా వ్యక్తిగతంగా తమ వద్దగా రావోద్దని, రూల్స్‌ ప్రకారమే కలవాలన్నారు.

 

ఈ క్రమంలో టాలీవుడ్‌ పెద్దలు సీఎం చంద్రబాబు కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 సాయంత్ర 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో సినీ పద్దలు ఆయనతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివ్రద్ధి, తాజా పరిణామాలపై సీఎంతో చర్చించనున్నారు. ఇదే విషయమై ఇప్టపికే సినీరంగ ప్రముఖులంతా కలిసి రావాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar