Site icon Prime9

Ram Charan – Upasana : చరణ్ – ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు..

tollywood celebraties wishes to Ram Charan - Upasana

tollywood celebraties wishes to Ram Charan - Upasana

Ram Charan – Upasana : మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన.. మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చరణ్ – ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

తనకు మనవరాలు పుట్టిన ఆనందాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’కు స్వాగతం అంటూ చిరు ట్వీట్ చేశారు. హార్ట్ సింబల్స్ తో తన మనవరాలిపై ప్రేమను కురిపించారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్..

 

రామ్ చరణ్, ఉపాసనలకు కంగ్రాట్యులేషన్స్ అని ట్వీట్ చేశారు. పేరెంట్స్ క్లబ్ కు స్వాగతం పలికారు. కూతురుతో గడిపే ప్రతి క్షణం జీవిత కాలమంతా మరిచిపోలేని మధురమైన జ్ఞాపకమేనని చెప్పారు. చిన్నారికి, మీకు అంతులేని సంతోషాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

 

 

Exit mobile version