Site icon Prime9

Drugs Case : టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనలు.. బయటికి వస్తున్న బడా సెలిబ్రిటీల లిస్ట్ !

tollywood celebaties involved in producer kp chowdary drugs case

tollywood celebaties involved in producer kp chowdary drugs case

Drugs Case : నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ కేసులో చౌదరితో విచారణ పూర్తి చేశారు. కాగా ఈ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడయినట్లు సమాచారం అందుతుంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన ఈ విచారణలో 12 పేర్లు మాత్రమే ఇప్పటి వరకు బయటికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.  అందులో టాలీవుడ్ నుంచి తెలుగు బిగ్‌బాస్‌ ఒక సీజన్‌లో పాల్గొన్న హీరోయిన్‌తో పాటు తెలుగులో స్పెషల్ సాంగ్స్‌ చేసిన హీరోయిన్‌తో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version