Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి ” విజయ్ ” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో వారసుడు సినిమా చేశాడు దళపతి విజయ్. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని రోజుల తేడాతో రిలీజ్ అయిన ఈ మూవీ ఓవరాల్ గా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది. విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ విజయ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది.
అయితే వారసుడు సినిమాపై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి, సీరియల్ లా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. ఇదే సమయంలో తమిళనాడులో వారిసు ముందు రిలీజ్ అయ్యి తెలుగులో వారసుడు వాయిదా పడేసరికి ఇక విజయ్ ఇకపై తెలుగు దర్శకుడితో సినిమా చెయ్యడని అంతా అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా విజయ్ మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడా అనే వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి.
ఈసారి ఊరమాస్ 100 కోట్ల డైరెక్టర్ తో విజయ్ Thalapathy Vijay..
కాగా ఇప్పుడు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ ప్రస్తుతం ఒకే చెప్పిన సినిమాలాను ఫినిష్ చేయగానే.. తెలుగు దర్శకుడితో సినిమాని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్ ఎవరంటే గోపీచంద్ మలినేని. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తో “వీరసింహారెడ్డి” చేసి బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నారు గోపీచంద్ మలినేని. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
ఈ మేరకు ఇప్పటికే విజయ్ కి గోపీచంద్ మలినేని కథ కూడా వినిపించాడని, విజయ్ ఓకే చెప్పాడని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వంద కోట్ల దర్శకుడిగా మారిన గోపీచంద్ మలినేని-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగారాజ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా షూటింగ్ జూలై నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత విజయ్-అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ అవ్వనుంది. అట్లీ – విజయ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ లు ఉన్నాయి. దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా అంటే భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తి చేసిన వెంటనే విజయ్, గోపీచంద్ మలినేనితో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈలోపు గోపీచంద్ మరో చేస్తాడో లేదా.. ఆ సినిమా కోసమే వెయిట్ చేస్తాడో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.