Site icon Prime9

God Father Movie: “తార్ మార్ తక్కర్ మార్” వచ్చేస్తుంది… ఇక కుర్రకారుకు పూనకాలే..!

thaar maar song from God father

thaar maar song from God father

God Father Movie: మెగా అభిమానులకు మెగా ఫీస్ట్… గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇద్దరు మెగాహీరోలు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

తార్ మార్ తక్కర్ మార్ అంటూ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్పెప్పులేసి కుర్రకారును ఉర్రూతలూగించినున్నారు. కాగా ఈ పాట ఈనెల 15నే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, సాంకేతిక సమస్యతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్, చిరు తొలిసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతూ ఆడియన్స్ కు కన్నుల విందు చేయనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్నాయి.

” తార్ మార్ తక్కర్ మార్..” అంటూ సాగే ఈ విజువల్ ట్రీట్ సాంగ్ ప్రోమో సెప్టెంబర్ 13న జనం ముందుకు వచ్చింది. మరి అలా వచ్చిందో లేదో ఇలా కొన్ని నిమిషాల్లోనే భారీగా వ్యూస్ రేట్ పెరిగిపోయాయి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను వేగం పెంచింది.

ఇదీ చదవండి: Aashiqui 3 Movie: “ఆషికి 3” సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న..!

Exit mobile version