Site icon Prime9

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ లో ఫైనల్ కి చేరిన తెలుగు వారియర్స్.. మ్యాచ్ హీరోగా తమన్

telugu warriors beat karnataka and goes to finals in ccl 2023

telugu warriors beat karnataka and goes to finals in ccl 2023

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ ఇటీవల తిరిగి మళ్ళీ గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లోని మ్యాచ్‌లు చూస్తుంటే దేశంలో ఐపీఎల్ ముందు గానే ప్రారంభం అయినట్లు అనిపిస్తుంది. సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరోలందరూ.. ఇప్పుడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో బౌండరీలు కొడుతూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారని చెప్పాలి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ లీగ్ లో.. శుక్రవారం నాడు సెమీఫైనల్స్ నిర్వహించారు. మొత్తంగా ఈ లీగ్ లో 8 టీమ్స్ పాల్గొనగా.. 16 మ్యాచ్‌లు జరిగాయి.

వాటిలో సెమీ ఫైనల్స్ కి భోజ్ పురి దబాంగ్స్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్ డోజర్స్ చేరుకున్నాయి. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిన్న (మార్చి 23) విశాఖపట్నంలో జరిగాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ భోజ్ పురి దబాంగ్స్ అండ్ ముంబై హీరోస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లు రెండు ఇన్నింగ్స్ గా జరగుతున్న విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ కి దిగిన ముంబై టీం మొదటి ఇన్నింగ్స్ లో (10 ఓవర్లు) 109 పరుగులు తీయగా, భోజ్ పురి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 80 పరుగులు మాత్రమే తీశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ముంబై టీం 62 పరుగులు తీసి.. మొత్తం మీద 92 పరుగులు టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్ ని భోజ్ పురి ఛేదించి ఫైనల్స్ కి ఎంట్రీ ఇచ్చేసింది.

ఇక మన తెలుగు వారియర్స్ అండ్ కర్ణాటక బుల్ డోజర్స్ మ్యాచ్ పై పైనే అందరిలోనూ ఉత్కంఠ రేపింది పడింది. టాస్ గెలిచి అఖిల్ సేన.. బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. ఇక బ్యాటింగ్ దిగిన కర్ణాటక 5 వికెట్స్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ తరువాత తెలుగు వారియర్స్ బ్యాటింగ్ కి దిగి మొదటి ఇన్నింగ్స్ ని 5 వికెట్స్ కోల్పోయి 95 పరుగులతో ముగించారు.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కర్ణాటక టీం మళ్ళీ 5 వికెట్స్ కోల్పోయి 98 పరుగులు చేసింది. దీంతో తెలుగు వారియర్స్ మొత్తం మీద 103 పరుగులు టార్గెట్ ఛేదించాల్సి ఉంది. చివరి ఓవర్ లో 6 వికెట్లు కోల్పోగా.. 6 బంతుల్లో 8 పరుగులు చేయాలన్న సమయంలో.. తమన్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. ఓవర్ లో మొదటి బంతినే బౌండరీ (4) పంపించేశాడు తమన్. ఆ తరువాత ఒక సింగల్ తీసి ప్రిన్స్ కి  స్ట్రైక్ ఇచ్చాడు. ప్రిన్స్ కూడా ఒక సింగల్ తీసి మళ్ళీ తమన్ కి స్ట్రైక్ ఇచ్చాడు. ఇక 3 బంతుల్లో 2 పరుగులు తీయాలి అన్న సమయంలో.. తమన్ 4 కొట్టి తెలుగు వారియర్స్ ని ఫైనల్స్ కి తీసుకువెళ్లాడు. మొత్తం 15 బంతుల్లో 25 పరుగులు చేసి నిన్నటి మ్యాచ్ లో హీరోగా నిలిచాడు థమన్. ఇక నేడు భోజ్ పురితో జరిగే ఫైనల్స్ పైనే అందరి ఆశలు ఉన్నాయి.

 

Exit mobile version