Site icon Prime9

Tollywood : తెలగు దర్శకుడుతో తెలుగు హీరోయిన్ లవ్ ట్రాక్

esha rebba prime9news

esha rebba prime9news

Tollywood: తెలుగు హీరోయిన్  ఈషా రెబ్బ ఓ వార్తా తెగ చక్కెర కొడుతుంది. ఈ వార్తా తెలుసుకునే ముందు ఈమెను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కానీ ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేక  ఆమె  సినిమాలను దూరంగా ఉంటుంది.  ఈషా రెబ్బా గురించి మనం  ప్రత్యేకంగా  చెప్పుకోవాలిసిన అవసరం లేదు . ఈమె  స్వగ్రామం   వరంగల్‌ కానీ  ఈషా చిన్నప్పటి నుంచి  హైదరాబాద్‌లో పెరిగారు అది మాత్రమే కాకుండా  MBA చేసి , కాలేజీ సమయంలోనే మోడలింగ్  శిక్షణ తీసుకొని  చిన్నగా  ప్రయత్నాలు మొదలు పెట్టారు.   2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ  సినిమా తర్వాత ఆమె మోహన కృష్ణ ఇంద్రగంటి  డైరక్షన్లో  వచ్చిన  అంతకు ముందు ఆ తర్వాత సినిమా వల్ల  ప్రేక్షకులను సంపాదించుకొని ,నటనలో మంచి గుర్తింపు తెచ్చుకొని  పాపులర్ అయ్యారు.

ప్రస్తుతం  ఈషా రెబ్బ  “అయిరామ్‌ జెన్మంగల్‌” తమిళ  సినిమాలో  కధనాయికగా  నటిస్తుంది ఇది మాత్రమే కాకుండా  “ఒట్టు” అనే తమిళ సినిమా. ఈ రెండు సి నిమాలకు సంభందించిన  షూటింగ్ వేగంగా జరుగుతుందని తెలిసిన సమాచారం.  ఈ సినిమా ఫలితాల  మీదే  ఈ ముద్దుగుమ్మ  కెరియర్  డిసైడ్‌  అవ్వబోతుందని చెప్పుకోవచ్చు.

ఐతే ఈషా రెబ్బ  మీద సోషల్ మీడియాలో ఓ వార్తా తెగ వైరల్ అవుతుంది. ఈమె తమిళ డైరెక్టర్ తో  పీకల్లోతు ప్రేమలో ఉందని ,  వీరి ప్రేమను ఇంట్లో చెప్పారని  ఇరు కుటుంబాలు అభ్యంతరాలు చెప్పకుండా వీరి పెళ్ళికి  ఒప్పుకున్నారని,  త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని  తెలిసిన సమాచారం. దీని పై ఈ  ప్రేమ  పావురాలు   స్పదించాలిసి ఉంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదో ? లేక ఈ వార్తలు రూమర్లని  కొట్టి పడేస్తారా అనేది ఇంకా తెలియాలిసి ఉంది.

Exit mobile version