Rahul Sipligen: బిగ్ బాస్ సీజన్ 3లో బెస్ట్ పెయిర్ గా ఎంతో ఫేమ్ ని సంపాదించారు రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు తిరిగారు.బిగ్‌బాస్-3లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి జంట మధ్య నడిచిన లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. అసలు హౌస్‌లో పునర్నవిని ఓ రేంజ్‌లో ట్రై చేశాడు సిప్లిగంజ్. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే మేమేమిద్దరం జస్ట్ మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచేశాడు . దానితో కెరీర్ లో బిజీ అయిపోయాడు. తర్వాత పునర్నవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి లండన్ వెళ్లిపోయింది. ఇక సిప్లిగంజ్ అయితే వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ చివరికి ఆస్కార్ వేదిక వరకూ వెళ్లిపోయాడు.
అయితే చాన్నాళ్ల తర్వాత రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి కలిశారు. రాహుల్ తన యూట్యూబ్ ఛానల్ కి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాడని తెలిసిందే. తాజాగా రాహుల్ సిప్లిగంజ్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ దుబాయ్ లో భారీగా ఖర్చుపెట్టి చేశారు.చాలా రోజులుగా ఈ సాంగ్ గురించి రాహుల్ చెబుతున్నాడు కానీ.. లాంఛింగ్‌ని ఇలా పునర్నవితో చేయిస్తాడని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు మళ్లీ కలిసి కనిపించినందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
&nbs
అయితే రాహుల్ తలుచుకుంటే ఇప్పుడు ఏ పెద్ద సెలెబ్రిటీతో అయినా లాంచ్ చేయించొచ్చు తన పాటని.కానీ పునర్నవితో ఉన్న స్నేహంతో తనని పిలిపించి రాహుల్ ఈ సాంగ్ లాంచ్ చేయించడం ప్రత్యేకం . దీనితో అభిమానులు బిగ్‌బాస్ ఎవర్ గ్రీన్ జోడి, క్యూట్ మీట్, పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్ ఆల్వేజ్ అంటూ వరుసగా కామెంట్లు వస్తూనే ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ వచ్చిన తర్వాత సిప్లిగంజ్ కెరీర్ ఇంకా ఊపందుకుంది. చిన్న సినిమాల నుంచి పెద్ద మూవీస్ వరకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఇక పాటలతో పాటు అటు యాక్టింగ్‌లో కూడా ఇరగదీస్తున్నాడు సిప్లిగంజ్. మొన్నామధ్య రంగమార్తాండ సినిమాలో రాహుల్ చేసిన పాత్రకి మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇటు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ మంచి బిజీగా ఉన్నాడు రాహుల్ భాయ్.