Site icon Prime9

BiggBoss: ఫైమా ఎలిమినేట్.. చేతిపై నాగ్ ముద్దు

faima-eliminated-nagarjuna-kisses-on-her-hand-in-bigg-boss

faima-eliminated-nagarjuna-kisses-on-her-hand-in-bigg-boss

BiggBoss: బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ రేసులో రేవంత్ తొందరపాటుతో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఎలాంటి పోటీ లేకుండా శ్రీహాన్ ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. అయితే నాగార్జున ఇంటి సభ్యులను అంతవరకూ కెప్టెన్సీ చేసినవారిలో ఎవరు బెస్ట్ అనే అభిప్రాయ సేకరణ చేశారు. దానికి సభ్యులంతా కూడా ఇనయా పేరును చెప్పడం విశేషం. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ స్టేజ్ మీదకి హిట్-2 టీం వచ్చింది. కాసేపు ఇంటి సభ్యులతో అడవి శేష్, దర్శకుడు శైలేష్ కొలను, హీరోయిన్ మీనాక్షి చౌదరి సరదాగా మాట్లాడారు.

ఇక ఈ ఆదివారం ఎలిమినేషన్స్ రౌండ్ రానే వచ్చింది. రోహిత్, కీర్తి, ఇనయా సేఫ్ అవ్వడంతో డేంజర్ జోన్లో ఆదిరెడ్డి, ఫైమా మిగిలారు. గతవారంలోనే ఫైమా రాజ్ కన్నా తక్కువ ఓట్లు వచ్చినా ఎవిక్షన్ పాస్ ఉండడం వల్ల మరో వారం కొనసాగగలిగింది. కాగా ఈ వారం ఆదిరెడ్డిని సేఫ్ చేసి ఫైమాను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.

వేదిక మీదకు వచ్చిన ఫైమాతో చిన్న గేమ్ ఆడించారు నాగ్. ఇంట్లో ఫన్ ఎవరు? ఫ్రస్టేషన్ ఎవరు? అనే గేమ్ అది. ఫైమా రేవంత్ తప్ప అందరి ఫోటోలను ఫన్ కేటగిరీలో వేసింది. రేవంత్ మాత్రం ఫ్రస్టేషన్ కేటగిరీలోనే ఉన్నాడు. రేవంత్ ‘మార్చుకంటాను ఫైమా’ అనేసరికి, నాగార్జున ‘ఇంకెప్పుడు మార్చుకుంటావ్’ అంటూ నవ్వేశారు దానితో అందరూ కాసేపు నవ్వుకున్నారు. ఇక ఫైమా తన చేతిపై ఎవరినీ ముద్దు పెట్టుకోనివ్వదనీ .. తనకి చక్కిలిగిలి అని, నాగ్ తో ఫైమా స్టేజ్ పై ఉండగా రేవంత్ చెప్పాడు. దాంతో ఫైమా చేతులు దాచేసుకున్నాకానీ తీసుకుని సరదాగా నాగార్జున ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టేశారు. ఫైమా సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ సరదా సన్నివేశం నవ్వులు పూయించింది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ కి ఫైమా తల్లి వచ్చినప్పుడు, శ్రీ సత్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. అదే ఎపిసోడ్ లో శ్రీసత్య తల్లి పరిస్థితిని చూసి ఆడియన్స్ చలించిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఫైమా తల్లి .. శ్రీ సత్యను గురించి అలా మాట్లాడటం ఫైమా ఎలిమినేషన్ కి కారణం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి: బాలీవుడ్ లో “పఠాన్” సరికొత్త రికార్డులు

Exit mobile version