Prime9

Bala Krishna: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పై సుప్రీం కోర్టు నోటీసులు జారీ

Bala Krishna: బాలకృష్ణ నటించిన సినిమా “గౌతమి పుత్రశాతకర్ణి” కు పెద్ద షాక్ ఇచ్చింది .నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించి నట్లు తెలిసిన సమాచారం.ఆయన నటించిన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు పన్ను తీసుకొని మరి కానీ టికెట్‌ రేట్లు మాత్రం అసలు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పన్నును సినీ ప్రేక్షలకు తిరిగి చెల్లించనందున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మామూలుగా ఐతే పన్ను మినహాయింపు సినిమాల టికెట్ ధరలను కొంత వరకు తగ్గించాలి. కానీ “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమా టికెట్ ధరలను తగ్గించ లేదని, పన్నుకు సంభందించినా డబ్బులు నిర్మాతల అకౌంటులోకి వెళ్లాయని పీటీషర్ తెలిపాడు.వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నిర్మాతలకు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు పంపించి నట్లు తెలిసిన సమాచారం.

నిర్మాతల నుంచి పన్ను రాయితీని వసూలు చేయాల్సిందిగా పిటిషన్‌లో పేర్కొన్నారు .ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నటుడు బాలకృష్ణకు కూడా నోటీసులు జారీ చేసింది.

Exit mobile version
Skip to toolbar