Site icon Prime9

Rajini Kanth : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ 171.. అఫిషియల్ అప్డేట్

super star rajini kanth new movie with lokesh kanagaraj

super star rajini kanth new movie with lokesh kanagaraj

Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజినీ. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఇక ఇటీవలే నెల్సన్ దర్శకత్వంలో “జైలర్” సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి 600 కోట్లు సాధించి రికార్డులు సృష్టించింది. రజినీ కమ్ బ్యాక్ ఇస్తే ఈ రేంజ్ లో ఉంటుంది అని మరోసారి నిరూపించారు. కాగా ఇప్పుడు తాజాగా మరోసారి రికార్డులను ఊచకోత కోయడానికి రజినీ సిద్దం అయినట్లు తెలుస్తుంది.

యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో తన నెక్స్ట్ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన లోకేష్.. ప్రస్తుతం విజయ్ తో “లియో”  సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఒక సినిమాకి మరొకటి లింక్ పెట్టి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడం.. దీంతో తమిళ్ లోనే కాక లోకేష్ సినిమాలకు సౌత్ అంతా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన మూవీస్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే లోకేష్ లియో తర్వాత.. కమల్ హాసన్ తో విక్రమ్ సీక్వెల్, కార్తీతో ఖైదీ సీక్వెల్, సూర్యతో ఒక మూవీకి కమిట్ అయ్యాడు. రజినీకాంత్ తో కూడా ఖచ్చితంగా ఒక సినిమా ఉండొచ్చు అని మొదట నుంచి చెప్తూనే ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఊహించని రీతిలో అందరికీ షాక్ ఇస్తూ మూవీ అనౌన్స్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని రజినీతో జైలర్ నిర్మించి హిట్ కొట్టిన సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైమ్ పడుతుందని తెలుస్తుంది.

 

Exit mobile version