Super Star Rajini Kanth : బీఎంటీసీ బస్టాండ్ కి సూపర్ స్టార్ రజినీ కాంత్.. పాత జ్ఞాపకాలలో !

సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “జైలర్”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 600 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 05:32 PM IST

Super Star Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “జైలర్”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 600 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల సమయంలోనే రజినీకాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే హిమాలయాల్లో పర్యటన పూర్తి అయిన అనంతరం పలు పుణ్య క్షేత్రాలను దర్శించే పనిలో పడ్డారు రజినీ. ఈ క్రమంలోనే మొన్న ఈ మధ్య యూపీలో కూడా పర్యటించారు.

కాగా రజనీకాంత్ నటుడు కాకముందు బీఎంటీసీ లో కండక్టర్ గా పని చేసిన విషయం తెలిసిందే. బస్ లో స్టైల్ గా టికెట్స్ ఇస్తున్న రజనీని ( Super Star Rajini Kanth ) చూసి దర్శకుడు బాల చందర్ గారు ఆశ్చర్యపోయి ఆయనను సినిమాలలోకి పరిచయం చేసారు. ఆ తర్వాత రజనీకాంత్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ నేడు ఉదయం 11:30 గంటలకు దక్షిణ బెంగళూరులోని జయనగర్ ప్రాంతం లోని బీఎంటీసీ డిపోను రజనీకాంత్ ఆకస్మికంగా సందర్శించారు.

జయనగర్ డిపోకు వెళ్లి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సిబ్బంది కి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. సిబ్బందితో సుమారు 15 నిమిషాల పాటు సంభాషించారు. బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్‌ లు అనుకోకుండా రజినీకాంత్ (Super Star Rajini Kanth) కలవడంతో ఆశ్చర్యంతో మునిగిపోయారు. మెకానిక్‌లు, ఇతర కార్మికులు కూడా ఆయనతో సెల్ఫీలను తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

అంతకు ముందు రజినీ ఝార్ఖండ్‌‌లోని రాంచీలో పర్యటించ.. ప్రసిద్ధ చిన్నమస్త స్వామి ఆలయాన్ని సందర్శించారు. రాంచీలోని యాగోధ ఆశ్రమంలో గంటసేపు ధ్యానం చేశారు. అనంతరం రాజ్ భవన్‌లో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. అయితే సూపర్ స్టార్ యోగి కాళ్ళకి నమస్కారం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.