Site icon Prime9

Sudheer Babu: “హంట్” తో హిట్ కొట్టనున్న సుధీర్ బాబు.. టీజర్ సూపర్

sudheer babu hunt movie teaser

sudheer babu hunt movie teaser

Sudheer Babu: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కనున్న తాజాగా చిత్రం హంట్. ఇటీవల సుధీర్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఆశించిన స్థాయిలో థియేటర్లలో సందడి చెయ్యలేకపోయింది. దానితో నేను రేడీ టూ ‘హంట్’ అంటూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మింస్తున్న హంట్ సినిమాకు మహేశ్ సూరపనేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఓకే వ్యక్తిలో ఉన్న మరో వ్యక్తిని పరిచయం చేసే సినిమాగా ఆసక్తికరమైన కథగా ఈ చిత్రం కనిపిస్తోంది. అర్జున్ A మరియు అర్జున్ B అనే రెండు పాత్రల మధ్య నలిగిపోయే క్యారెక్టర్లో హీరో సుధీర్ బాబు కనిపించనున్నాడు. ఒకే వ్యక్తి, ఒక పాత్ర నుంచి మరోపాత్రలోకి మారినప్పుడు అతని ధోరణి ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో సుధీర్ బాబు విభిన్నంగా విలక్షణంగా కనిపిస్తున్నాడు.

ఈ టీజర్లో తాను అర్జున్ ఏ గానే ఉండాలని అనుకుంటున్నట్టుగా హీరో చెప్తుంటాడు. అయితే ‘ఏ కేసును ఆ అర్జున్ మొదలుపెట్టాడో అదే కేసును ఈ అర్జున్ పూర్తి చేయాలి’ అని హీరోతో శ్రీకాంత్ అనడం ఇందులో ఆసక్తికరమైన అంశం. ‘ప్రేమిస్తే’ హీరో భరత్ కూడా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు.

ఇదీ చదవండి: విజువల్స్ వండర్ గా ఆదిపురుష్ టీజర్.. అస్సలు బాలేదంటున్న ఫ్యాన్స్

Exit mobile version