Site icon Prime9

SSMB29: బిగ్ ట్విస్ట్.. మహేష్, రాజమౌళి సినిమాలో విలన్‌గా.. గ్లోబల్ బ్యూటీ!

Mahesh Babu and Rajamouli Movie: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కబోతోంది. మహేష్ 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్ట్‌గా ప్లాన్‌ చేశాడు జక్కన్న. ఇటీవల ప్రీ పొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకుని పూజ కార్యక్రమంతో లాంచ్‌ అయ్యింది. ఇక త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి SSMB29పై రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

తరచూ ఏదోక అప్‌డేట్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరగనుందని సమాచారం. ఇది పాన్‌ వరల్డ్‌ మూవీ కావడంతో ఇందులో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన లేదు కానీ, ఆమె SSMB29 హీరోయిన్‌ అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రియాంక హైదరాబాద్‌ రావడం, ఆ తర్వాత రాజమౌళి పోస్ట్‌కి ఆమె రెస్పాండ్‌ అవ్వడంతో అంతా ఫిక్స్‌ అయిపోయారు. ప్రస్తుతం ప్రియాంక తన సోదరు పెళ్లి పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలో SSMB29కి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అందు అభిప్రాయపడుతున్నట్టుగా ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్‌ కాదట. ఆమె విలన్‌ పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ప్రియాంక లేడీ విలన్‌గా కనిపించబోతోందట, ఇందుకు సంబంధించి లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయ్యిందని.. అంతా ఒకే అవ్వడంతో ఆమె ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే అ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్‌ బ్యూటీని తీసుకునేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోయిన్‌తో పాటు ఇతర తారాగాణంలో వేటలో ఉన్నారట. అయితే ఇందులో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు వినిపించాయి.

అయితే ఇందులో నిజం లేదని ఆయనే స్వయంగా తేల్చేసాడు. ప్రస్తుతం రాజమౌళి అండ్‌ టీం తారగాణం వేటలో ఉన్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసారు.

Exit mobile version
Skip to toolbar