Site icon Prime9

Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలలో శృతి హాసన్ కు బ్రేక్ ఇచ్చే హీరో ఎవరు?

sruthi haasan double bonanza to her fans with two big movies

sruthi haasan double bonanza to her fans with two big movies

Shruti Haasan: మెగాస్టార్‌ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఈ రెండు సినిమాల్లోనూ చిరు, బాలయ్యల సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది శ్రుతిహాసన్.

sruthi hasaan in veera simhareddy

sruthi hasaan in veera simhareddy

కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇకపోతే చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం శ్రుతి మెగాస్టార్ మరియు బాలయ్యలతో కలిగి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీలోనూ నటిస్తోంది.

sruthi hasaan in walther veeraiah

sruthi hasaan in walther veeraiah

మెగాస్టార్‌ చిరంజీవి– బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. కాగా నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్‌ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి.. ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి.

మరి ఈ సంక్రాంతి  శ్రుతిహాసన్ కు బ్రేక్ తీసుకురానుందా..  చిరు బాలయ్యలలో ఎవరూ ఈ ముద్దుగుమ్మకు బ్రేక్ ఇవ్వనున్నారు.. లేదా ఈ రెండు సినిమాలు డబుల్ బొనాంజాగా నిలవనున్నాయా అనేది వేచి చూడాలి.

ఇదీ చదవండి: వేరే హీరో సపోర్ట్ లేకుండా సినిమాలు చెయ్యనంటున్న మెగాస్టార్ చిరంజీవి.. కారమేంటంటే..?

 

 

Exit mobile version
Skip to toolbar