Site icon Prime9

Avatar 2 : అవతార్ 2 కు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్

Avatar 2

Avatar 2

Avatar 2 : 2009లో విడుదలైన అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు $3 బిలియన్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి అవతార్: ది వే ఆఫ్ వాటర్ పైనే ఉంది, ఇది డిసెంబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం టాలీవుడ్ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కు దక్కింది. శ్రీనివాస్ అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్) యొక్క తెలుగు వెర్షన్‌కు డైలాగ్‌లు రాశారు.

బ్రహ్మస్త్ర సినిమా తెలుగు వెర్షన్‌కు కూడా అవసరాల శ్రీనివాసే మాటలు రాశాడు. ఈయన సినిమాల్లోని డైలాగ్స్‌ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యాయో తెలిసిందే. ఈరకంగానే అవతార్‌కు కూడా డైలాగ్స్ రాసి ప్రేక్షకులను మెప్పిస్తాడనే అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రం అవతార్ ఫిల్మ్ సిరీస్‌లో రెండవ విడతగా 20వ సెంచరీ స్టూడియోస్ ద్వారా పంపిణీ చేయబడింది.

అవతార్ సీక్వెల్ లో అవతార్ 3 డిసెంబర్ 20, 2024న థియేటర్లలోకి వస్తుంది; అవతార్ 4, డిసెంబర్ 18, 2026న రిలీజవుతాయి. అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడిగా తన తదుపరి చిత్రానికి ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version