Natural Star Nani : సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
బాల్యం..
నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. 1984 ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో జన్మించారు. సెయింట్ ఆల్ఫోన్సా హై స్కూల్ లో పదో తరగతి చదివిన నాని, ఎస్.ఆర్.నగర్ లోని నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తరువాత వెస్లీ కాలేజ్ లో డిగ్రీ చదివారు. చదువుకొనే రోజుల నుంచీ నాని మనసు సినిమాల వైపు పరుగు తీసింది. మణిరత్నం సినిమాలు నానిని భలేగా ఆకర్షించేవి. ఏదో ఒక రోజు ఆయనలాగా దర్శకత్వం వహించాలని కలలు కన్నారు నాని.
(Natural Star Nani) టాలీవుడ్ ఎంట్రీ..
బాపు ‘రాధా గోపాలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. నితిన్ ‘అల్లరి బుల్లోడు’కు కె.రాఘవేంద్రరావు దగ్గర, మంచు విష్ణు హీరోగా రూపొందిన “అస్త్రం, ఢీ” చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేశారు. తరువాత ఓ స్నేహితురాలి సలహా మేరకు రేడియో జాకీగా పనిచేస్తున్న సమయం లోనే మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చెమ్మా’లో నటింకయే ఛాన్స్ దక్కింది. ఆపై నాని హీరోగా రూపొందిన చిత్రాలలో “రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్” జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ‘ఈగ’తో స్టార్ డమ్ తెచ్చుకున్న నాని.. భలే భలే మగాడివోయ్, మజ్ను, భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ,ఇలా గుర్తుండిపోయే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకోగలిగాడు.
స్టార్ హీరోగా సాగుతున్న నాని నిర్మాత గానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. ‘డి ఫర్ దోపిడి’ చిత్రానికి సహ నిర్మాతగా మారిన నాని.. అ అతర్వాత ‘అ!. ‘హిట్: ద ఫస్ట్ కేస్’, ‘హిట్ : ద సెకండ్ కేస్’ సినిమాలను నిర్మించి నిర్మాత గానూ విజయం సాధించారు. తన సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే ఆంథాలజీ నిర్మించారు. గత సంవత్సరం ‘అంటే సుందరానికి’ చిత్రంలో హీరోగా నటించిన నానికి, ఆ యేడాది నిరాశనే మిగిలింది. ఈ నేపథ్యంలో తాను హీరోగా నటించిన ‘దసరా’పైనే నాని ఆశలు పెట్టుకున్నారు. మార్చి 30న విడుదల కానున్న ‘దసరా’తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొడతాం అని గట్టిగా చెబుతున్నారు.
కాగా నాని పుట్టిన రోజు కావడంతో అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నానిని అభిమానించే వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులను ఇలాగే, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో నాని అందరికీ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ పెట్టారు. దానికి తోడుగా అదిరిపోయే నోట్ కూడా రాసుకొచ్చారు. ప్రతి శుక్రవారం ‘సినిమాలు’ రిలీజ్ అవుతున్న తరుణంలో తానూ శుక్రవారమే రిలీజ్ అయ్యానంటూ ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/