Site icon Prime9

Somy Ali: అతను ఒక శాడిస్టు.. పూజించకండి.. సోమీ అలీ

Bollywood: సల్మాన్ ఖాన్ మరియు సోమీ అలీ దాదాపు ఒక దశాబ్దం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారు అనేక ప్రకటనలలో కలిసి కనిపించారు. కలిసి ఒక చిత్రానికి సంతకం చేశారు. అయితే అది నిలిచిపోయింది. తరువాత వారిద్దరు విడిపోయారు. సోమీ తిరిగి యూఎస్ కి వెళ్లారు. ఆమె యుక్త వయస్సులో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్‌ ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిందని చాలా మందికి తెలియదు.

ప్రస్తుతం అమెరికాలో తన ఎన్జీవోను నడుపుతున్న సోమీ, శుక్రవారం తన మాజీ ప్రేమికుడిపై సోషల్ మీడియాలో ఒక నోట్‌ను పంచుకున్నారు. ఆమె సల్మాన్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’ నుండి ఒక స్టిల్‌ను షేర్ చేసింది. మహిళలను కొట్టేవాడు. నేను మాత్రమే కాదు, చాలా మంది. దయచేసి అతనిని పూజించడం ఆపండి. అతను ఒక శాడిస్ట్ *#uk. మీకు తెలియదు అని రాసింది. అయితే ఈ పోస్ట్‌లో నటి సల్మాన్ పేరును ప్రస్తావించలేదు లేదా అతనిని ట్యాగ్ చేయలేదు.

Exit mobile version