Singer Mika Singh Reward to Auto Driver: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. గతవారం ఆయన ఇంట్లో ఓ దుండగుడు దొంగతనానికి యత్నించగా.. అతడిని అడ్డుకున్న సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ తన కుమారుడు తైమూర్, కేర్ టేకర్ సాయంతో ఆటోలో ముంబై లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా తనని ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్‌ని సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఓ పంజాబీ సింగర్ ఆటోడ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అతడికి భారీగా రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. సూపర్ స్టార్ అయిన సైఫ్‌ని ఆస్పత్రికి వెళ్లేందుకు సాయం చేసిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రికార్డు ప్రకటిస్తూ సోషల్ మీబడియాలో పోస్ట్ చేశాడు.
“ఎంతోమందికి ఇష్టమైన సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) సకాలంలో ఆస్పత్రికి స్పందించి ఆస్పత్రికి తీసుకువెళ్లని భజన్ సింగ్ భారీ రివార్డుకు అర్హుడని నేను నమ్ముతున్నాను. అతడి పూర్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. అతడికి లక్ష రూపాయలు బహుహతిగా ఇవ్వాలనుకుంటున్నా” అంటూ పోస్ట్ చేశాడు. ఇక సైఫ్ కూడా డిశ్చార్జ్ అవ్వగానే ఆటోడ్రైవర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక అతడికి భారీగా రివార్డు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఆస్పత్రి నుంచి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన సైఫ్ ఇంటికి రావడంతో ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఖాన్ కుటుంబమంత ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.