Site icon Prime9

Shilpa Shetty : భర్తతో విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి..

Shilpa Shetty and raj kundra divorce news got viral on media

Shilpa Shetty and raj kundra divorce news got viral on media

Shilpa Shetty : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ హీరోయిన్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య నిత్యం ఏదో వివాదాల్లో చిక్కుకొని నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా శిల్పాశెట్టి తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె భర్త రాజ్ కుంద్రా లేటెస్ట్ గా చేసిన ట్వీట్ తో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకి అఆ ట్వీట్ లో.. శిల్పా గురించి ప్రస్తావించకుండా “మేము విడిపోయాము ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అంటూ రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

కాగా రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి (Shilpa Shetty) 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వియాన్, సమీషా ఉన్నారు. 2021 లో రాజ్ కుంద్రా పోర్న్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యి కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి రాజ్ ముఖాన్ని చూపించకుండా మాస్క్ ధరించి తిరుగుతున్నాడు. చాలా రోజులుగా మాస్క్ తో కనిపించిన రాజ్ కుంద్రా ఇటీవల UT69 ట్రైలర్ లాంచ్ వేడుకలో తన మాస్క్ తొలగించారు.

అయితే కొందరు మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని.. ఇన్నాళ్లు తనతో ఉన్న మాస్క్ గురించి చెప్పాడని..ఇకపై మాస్క్ ఉపయోగించనని ఇలా ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరూ నిజంగానే విడిపోయారా ?.. అని సందేహాలు వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

 

 

Exit mobile version