Site icon Prime9

Sharwanand: సెప్టెంబర్ 9న రిలీజవుతున్న ఒకే ఒక జీవితం

Tollywood: హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇది శర్వానంద్ కు 30 వచిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్, అమ్మ పాట బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. శర్వానంద్‌ని తన పనిపై దృష్టి పెట్టలేని నిరాశలో ఉన్న సంగీతకారుడిగా మూవీ గ్లింప్స్ చూపించింది. శాస్త్రవేత్త అయిన నాజర్ సమయాన్ని కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తాడు. శర్వానంద్ తన స్కూల్ డేస్‌లో తన తల్లితో ఫోటో దిగడం మరియు అమ్మ పాట నేపథ్యం సన్నివేశానికి ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని నటిస్తుండగా, అతని ప్రేమికురాలిగా రీతూ వర్మ నటిస్తోంది.

సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించిన ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు సంబంధించి మరిన్ని ఆశ్చర్యకరమైన ప్రకటనలు ప్లాన్ చేస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి.

Exit mobile version