Shahrukh Khan: దేశమంతా ప్రజెంట్ IPL ఫీవర్ నడుస్తోంది. కాగా గురువారం (ఏప్రిల్ 6) నాడు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదిక కోల్‌కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోల్‌కతా టీం బెంగుళూరు జట్టుపై ఘన విజయం సాధించింది. దీనితో హోం టైన్లో కేకేఆర్ జట్టు గెలవడం ఈ సీజన్లో ఇదే తొలిసారి కావడంతో కేకేఆర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే కోల్‌కత్తా జట్టు యజమాని షారుఖ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ కి తన కూతురు సుహానా ఖాన్ తో వచ్చి సందడి చేశాడు.
మైదానంలో స్పెప్పులేసిన కింగ్ ఖాన్(Shahrukh Khan)
మ్యాచ్ జరగడానికి ముందే తన టీం ఆటగాళ్లతో మాట్లాడిన షారుఖ్ వారిలో ఫుల్ జోష్ నింపి ఎంకరేజ్ చేశాడు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు గ్యాలరీలో కూర్చొని చిన్నపిల్లాడిలా మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఇక తన టీం గెలవడంతో ఆనందంతో పఠాన్ మూవీలోని సాంగ్ మరియు తన సిగ్నేచర్ స్టెప్స్ వేస్తూ మైదానంలో సందడి చేశారు షారుఖ్. ఇలా షారుఖ్ క్రికెట్ మైదానంలో డ్యాన్స్ వేసిన వీడియోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పఠాన్ సక్సెస్ షారుఖ్ ఇలా బయటకు వచ్చి తన టీంతో కలిసి సందడి చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
అంతేకాక విరాట్ ను హగ్ చేసుకుని స్పోర్టివ్ స్పిరిట్ ను నింపారు షారుఖ్. అంతటితో ఆగక పఠాన్ సాంగ్ కు విరాట్ తో స్టెప్పులేపిస్తూ షారుఖ్ తెగ సంతోషం కనపరిచారు. మొత్తానికి నిన్నటి మ్యాచ్ తో అటు కేకేఆర్ ఫ్యాన్స్, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ ఫొటోలు, వీడియో కాస్త నెట్టింట హల్చల్ చేస్తున్నారు.