Shah Rukh Khan-Amir khan:బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్, అమీర్ ఖాన్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు గత కొన్ని దశాబ్దాల నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సూపర్ స్టార్లుగా ఎదిగారు. అయితే మనలో చాలా మంది వీరు పెద్ద స్టార్లు చిన్న ఆర్టిస్టులను ఏమీ పట్టించుకుంటారు అని అనుకుంటారు కానీ.. వీరిద్దరు తమతో నటించిన చిన్న ఆర్టిస్టులకు ఏదైనా కష్టం వచ్చిన ఆదుకుంటారని.. వారి ఇళ్లలో ఏదైనా బర్త్‌డే ఫంక్షన్లు కానీ.. శుభ కార్యాలు జరిగినా వచ్చి పలకరించిపోతుంటారని కమేడియన్ సునీల్ పాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక సునీల్‌పాల్ విషయానికి వస్తే ఆయన కామెడీ షోలు హిందీలో చాలా పాపులర్.
కమేడియన్ సునీల్ పాల్ షారూక్‌ఖాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఖాన్ గత 30 సంవత్సరాల నుంచి ఇండస్ర్టీలో ఉన్నారు. ఇప్పటికి ఆయన స్టార్‌డం ఎక్కడా తగ్గలేదు. తోటి ఆర్టిస్టుల పట్ల ఉదారంగా ఉండటంతో పాటు వారు ఆపదలో ఉంటే సాయం చేస్తూ పెద్ద మనసు చాటు కుంటాడని సునీల్‌చెప్పాడు. దీనికి ఉదాహరణగా ముంబైలో ఓ స్లమ్ ఏరియాలో సునీల్ ఉంటాడు. అదే స్లమ్‌లో అంటే మురికి బస్తీలో షారూక్ సిబ్బందిలో ఒకరు నివసిస్తుంటాడు. అయితే అర్ధరాత్రి పూట షారూక్ అతని ఇంటికి వచ్చి పది, పదిహేనే నిమిషాలు గడిపి వెళ్తుంటాడని చెప్పాడు.
మురికివాడలకు వచ్చి.. (Shah Rukh Khan-Amir khan)
షారూక్‌ఖాన్ వద్ద సుభాష్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ప్రస్తుతం అతను చనిపోయాడు. అతను తాను నివసించే స్లమ్ ఏరియాలో నివసించే వాడు. షారూక్ నాలుగు నుంచి ఆరు నెలలకు ఒకసారి అతడి ఇంటికి వచ్చి వెళ్లేవాడు.సుభాష్ ఇంట్లో పిల్లల పుట్టిన రోజు కానీ.. ఇతర వేరే శుభకార్యం జరిగితే షారూక్ రాత్రి 12 లేదా ఒంటి గంటకు నిశ్శబ్దంగా వచ్చి 10-15 నిమిషాలపాటు గడిపి వెళ్లేవాడు. అలాగే సింగపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో మోరానీ బ్రదర్స్ తనకు రూ.20వేలు ఇచ్చారు. షారూక్ ముందు తనను యాక్ట్ చేయమంటే చేశాను. అయితే సింగపూర్‌లో జరిగిన ఒక షోలో షారూక్ ప్రతి ఒక్క ఆర్టిస్టు.. వారిలో తనను కూడా ఆడియన్స్‌కు పరిచయం చేశారని చెప్పుకొచ్చాడు. షారూక్, అమీర్‌లు చాలా సింపుల్ గర్వం అనేది ఎక్కడ కనిపించదు. చేసిన సాయం గురించి బయటికి గొప్పగా చెప్పుకోరు. అందుకే ఇన్ని దశాబ్దాలు పాటు సినీ రంగంలో ఉన్నా వారి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. కేవలం రీల్ హీరోలు కాదు.. రియల్ హీరోలు అని సునీల్ పాల్ ప్రశంసలు కురిపించారు.