Site icon Prime9

Serial Actress Jyothi Rai : వెబ్ సిరీస్ తో రాబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ “జ్యోతి రాయ్‌”..

Serial Actress Jyothi Rai poster released from pretty girl web series

Serial Actress Jyothi Rai poster released from pretty girl web series

Serial Actress Jyothi Rai : ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న “గుప్పెడంత మనసు” సీరియల్‌ లో జగతి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి “జ్యోతి రాయ్‌”. సీరియల్ లో హీరోకి అమ్మగా.. అద్బుతంగా నటిస్తూ చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే నెటిజన్లకు మాత్రం.. జ్యోతి రాయ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఇస్తాం ఉండడం మాత్రం పక్కా అని చెప్పవచ్చు. సీరియల్ లో చీర కట్టులో అత్త పాత్రలో కనిపించే ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ పొట్టి బట్టల్లో కుర్రాళ్లకు హీట్ పెంచేయడం గ్యారంటీ అనేలా పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇటీవల ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఆ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతూ.. హీరోయిన్ లా ఉన్న ఈమె అమ్మ పాత్రలు వేయడం ఏంటి అని అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గానే తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఈ బ్యూటీ.. ఇకపై సీరియల్స్‌లో నటించనని నెటిజన్లలో చిట్ చాట్ చెప్పింది. ఇప్పుడు ఆమె చేతిలో లీడ్‌గా వెబ్ సిరీస్‌లు, సినిమాలున్నాయని తెలిపింది. అందులో భాగంగా తాజాగా తన కొత్త వెబ్ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

ప్రెట్టీ గర్ల్ అంటూ రాబోతోన్న ఈ వెబ్ సిరీస్‌లో జ్యోతి రాయ్ ఇలా హాట్‌గా కనిపించబోతోందని తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే అర్దం అవుతుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. జ్యోతి రాయ్ (Serial Actress Jyothi Rai) మరింత హాట్ గా కనిపించడమే కాకుండా ఇంటి పేరు కూడా మారిపోయినట్లు కనిపిస్తుంది. జ్యోతి రాయ్ గత కొన్ని రోజులుగా యువ దర్శకుడు సుకు పూర్వాజ్ తో రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కూడా తమ తమ ప్రైవేట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూనే వస్తున్నారు. త్వరలోనే శుభవార్త చెబుతామని పోస్టులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జ్యోతి తన పేరు చివర్లో పూర్వాజ్ అని పెట్టుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది.

Exit mobile version