Site icon Prime9

Zebra OTT: ఓటీటీ వచ్చేసిన సత్యదేవ్‌ జీబ్రా – ఎక్కడ చూడాలంటే

sathyadev zebra ott

sathyadev zebra ott

Zebra Now Streaming on OTT: నటుడు సత్యదేవ్‌ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సహానటుడిగా, హీరోగా, విలన్‌గా పాత్ర డిమాండ్‌ మేరకు వెండితెరపై మెప్పిస్తున్నాడు. ఈ మధ్య వరుసగా లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సత్యదేవ్‌ ఈ ఏడాది జీబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 22న థియేటర్లో విడుదలైన మంచి విజయం సాధించింది. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వ వహించిన ఈ సినిమాను ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మించారు.

ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన జీబ్రా మూవీ సూపర్‌ హిట్‌ అందుకుంది. ఇక థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ప్రస్తుతం జీబ్రా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆహా కొత్త పోస్టర్‌ రిలీజ్ చేస్తూ మూవీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. మరి థియేటర్లో మిస్‌ అయిన వారు ఆహాలో ఈ జీబ్రా చూసి ఎంజాయ్‌ చేయండి.

Exit mobile version