Samantha: విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చేయని నేరానికి నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి
విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది.
తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా సమంత, నాగ చైతన్య ఉన్నారు.
చై, సామ్ కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లైన నాలుగేళ్లకు.. అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. వివాహ బంధంపై సమంత మరోసారి ఆసక్తి వాఖ్యలు చేసింది.
శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా వైవాహిక బంధంపై వ్యాఖ్యలు చేసింది.
వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయితీగా ఉన్నప్పటికి అది వర్కౌట్ కాలేదని సమంత తెలిపింది. పుష్ప లో ఐటెమ్ సాంగ్ చేయడం చాలా మందికి ఇష్టం లేదని చెప్పింది.
‘ఊ అంటావా’ అనే పాటకు ఆఫర్ వచ్చినపుడు.. ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఆ పాట చేయడం మానుకోవాలని సూచించినట్లు తెలిపింది. స్నేహితులు కూడా ఆ పాటను చేయొద్దని అన్నారు.
నేనేం నేరం చేయనప్పుడు.. ఎందుకు మానుకోవాలని అని ఆలోచించాను. నా నిర్ణయం సరైనదే అని తెలిశాక పాటకు ఓకే చెప్పాను అని తెలిపింది.
నా పరిస్థితి ఎవరికి రాకుడదు.. (Samantha)
విడాకుల అనంతరం నేను ఎన్నో బాధలు పడ్డాను. నాకు వచ్చిన వ్యాధితో మరింత కుంగిపోయాను. ఆ వ్యాధి వల్ల.. నాపై నాకే కంట్రోల్ లేకుండా పోయింది.
దీంతో నేను నీరసంగా కనిపించవచ్చు, ఒక్కోసారి బొద్దుగా కనిపించవచ్చు. నేను స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని చాలా మంది అంటున్నారు.
కానీ దానికి వేరే కారణం ఉంది. నాకు వచ్చిన పరిస్థితులు మరే నటికి రాకుడదని కోరుకుంటానని సమంత తెలిపారు.
ప్రస్తుతం తన గురించి ఎవరు కామెంట్ చేసిన పట్టించుకునే పరిస్థితిలో తాను లేనని సమంత స్పష్టం చేసింది.