Site icon Prime9

Salaar : సలార్ మూవీ నుండి న్యూ అప్డేట్ .. ట్రైలర్ డేట్ ఫిక్స్ ..

salaar-trailer new-update

salaar-trailer new-update

Salaar : టాలీవుడ్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది . అయితే సలార్ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టడం లేదు.

సలార్ మూవీ యూనిట్ పై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. టీజర్ వచ్చినా అందులో ప్రభాస్ ని పూర్తిగా చూపించలేదు. దీంతో సలార్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ట్రైలర్ డేట్ వాయిదా పడుతూవస్తుంది . చిత్ర యూనిట్ పై అభిమానులు మండి పడుతున్నారు . దీనితో చిత్ర యూనిట్ అభిమానుల ఫోర్స్ కి తట్టుకోలేక , నేడు అధికారికంగా చిత్రయూనిట్ సలార్ ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చింది.ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7.19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.కానీ దీనికి కూడా ఫ్యాన్స్ ఈ డేట్ ఇయిన ఫిక్స్ లేక చేంజ్ చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తూ నిరాశ మిగులుతుంది ఏమో అని అనుకుంటున్నారు . కానీ ఈ ప్రకటన వింటుంటే ఈ సారి ఫిక్స్ అయ్యేలానే వుంది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. దీంతో అభిమానులు ఈ ట్రైలర్ కోసం వేచి చూస్తున్నారు. ఈ సారి ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే. ఈ ట్రైలర్ అభిమానులని, ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ..ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు.

Exit mobile version