Saif Ali Khan Attacker Arrested: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గురువారం సైప్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటి సీసీ కెమెరాలు పరిశీలించగా.. మెట్ల గుండా నిందితుడు పారిపోతున్న దృశ్యాలు బయటపడ్డాయి.
దాని ఆధారంగా పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఘటన జరిగిన 36 గంట్లోనే కేసు ఛేందించారు. బాంద్రా ప్రాంతంలోనే నిందితుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేవారు. రాత్రి పూట అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానిక పాల్పడిన అతడిపై సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద పలు కేసులు నమోదు చేశారు. ఇది కావాలని చేసిందా? అయితే దీని వెనక ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసుల నిందితుడి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
BREAKING: Saif Ali Khan attacker🔪 ARRESTED👮🏻 pic.twitter.com/mNQnloidQc
— Manobala Vijayabalan (@ManobalaV) January 17, 2025
గురువారం తెల్లవారు జామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి నిందితుడు అక్రమంగా చోరబడ్డాడు. మొదట ఆయన చిన్న కుమారుడు జహింగీర్ రూంకి వెళ్లిన అతడిని పని మనిషి గమనించి కేకలు వేసింది. దీంతో పనిమనిషిపై కత్తితో దాడి చేసి ఆమెను బంధించాడు. ఆ అలికిడితో అక్కడి వెళ్లిన సైఫ్ దొంగని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నిందితుడు సైఫ్‌పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఒంటిపై ఆరు చోట్ల కత్తిపోట్లు కావడంత సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న ఆయనను ఇంటి వర్కర్స్‌తో సహాయంతో ఆయన కుమారుడు ఉదయం 3 గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రికి తీసువెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స అందించారు. మెడ భాగంలో లోతుగా కత్తిపోటు తగిలింది, వెన్నుముకలో రెండు అంగుళాల కత్తి మొన భాగం ఇరికి ఉండటాన్ని గుర్తించి ఆయనకు సర్జరీ చేశారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడ ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.