Site icon Prime9

Saif Ali Khan: సైఫ్‌ని ఆవేశంతో పొడిచాడు – బయటే ఉన్న నా నగలు ముట్టుకోలేదు: కరీనా కపూర్‌

Kareena Kapoor Statement Saif Ali Khan Attack: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై సినీ నటి, ఆయన సతీమణి నటి కరీనా కపూర్‌ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గురువారం తన ఇంట్లోకి దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి తీరుపై కరీనా అనుమానం వ్యక్తం చేసింది. శనివారం బాంద్రా పోలీసులు కరీనా స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా సైఫ్‌ని పొడిచాడు.

సైఫ్‌ అతడిని అడ్డుకోవడంతో కోపంతో కత్తితో దాడి చేశాడని, ఆవేశంతో పలుమార్లు కత్తితో పొడిచాడని చెప్పింది. అతడి తీరు చూస్తే దొంగతనానికి వచ్చినట్టు అనిపించలేదని అనుమానం వ్యక్తం చేసింది. తన నగలు బయటే ఉన్నా వాటినిత ఈసుకునే ప్రయత్నం చేయలేదంటూ కీలక విషయాలను తెలిపారు. ఈ ఘటన తర్వాత తన సోదరి కరిష్మా కపూర్‌ వచ్చిన తన ఇంటికి తీసుకవెళ్లినట్టు చెప్పింది.

కాగా గురువారం తెల్లవారుజామును గుర్తు తెలియని వ్యక్తి సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో బాంద్రాలోని అపార్టుమెంట్‌లో సైఫ్‌, కరీనా నివాసముంటున్న ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. ముందురోజు రాత్రి తన చిన్నకుమారుడు జెహ్‌ గదిలో నక్కిన అతడిని మనిమనిషి గుర్తించి కేకలు వేసింది. దీంతో ఆమె బంధించి కత్తితో బెదిరించాడు. ఆ అలికిడితో నిద్ర లేచిన సైఫ్‌ దుండగుడిని ఆడ్డుకునే క్రమంలో అతడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటన తీవ్రంగా గాయపడ్డ సైఫ్‌ని తన కుమారుడు తైమూర్‌ కేర్‌ టేకర్‌ సహాయంతో ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ తనంతట తానే నడుచుకుంటూ వచ్చారని, స్ట్రేచర్‌ కూడా వాడలేదని ఆస్పత్రి వైద్యులు అన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్న సైఫ్‌కి ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు తగిలినట్టు వైద్యులు తెలిపారు. వెన్నుముక భాగంలో రెండు అంగుళాల కత్తి విరిగిందని, మెడ భాగంలో లోతుగా కత్తితో కోసుకుందని అన్నారు. వాటికి సర్జరీ చేశామన్నారు. ప్రస్తుతం సైప్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మెల్లిగా ఆయన కోలుకుంటున్నారని, సైఫ్‌ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సి అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar