Site icon Prime9

Saif Ali Khan: నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

Siaf Ali Khan Stabbed at his home: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల ఆయనకు గాయాలైనట్టు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి పై బులిటెన్ ఇవ్వనున్నట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది.

చోరీ కోసం వచ్చి దాడి

బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఈ రోజు తెల్లవారు జామున 2 గంటల 30 నిమిషాలకు చోరీ జరిగింది. ఇంట్లో ఓ దొంగ ప్రవేశించి చోరీకి యత్నించాడు. శబ్ధం రావడంతో ఆయన ఇంటి సిబ్బంది మేల్కొని సైఫ్ కి సమాచారం ఇచ్చింది. సైఫ్ తన సిబ్బందితో కలిసి దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ ని కత్తితో పోడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటన గాయపడ్డ సైఫ్ ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సైఫ్ కు ఒంటిపై పలుచోట్లు కత్తిపోట్లు పడటంతో సర్జరీ అసవరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ ఖాన్ భార్య కరీనా కపూర్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.సైఫ్ అలీఖాన్ పై దాడి పై కుటుంబ సభ్యుల ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారిక తెలిపారు.

Exit mobile version