Site icon Prime9

RRR Movie : ” ఆర్ఆర్ఆర్ ” ని వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు

rrr-movie-got-another-internation-award

rrr-movie-got-another-internation-award

Tollywood News: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ” ఆర్ఆర్ఆర్ “. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో… బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించారు. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, తారక్ కొమరం భీమ్ గా నటించి అందర్నీ మెప్పించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. ఇటీవలే రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

కాస్ట్ అండ్ క్రూ ప్రెస్టీజియస్ హెచ్ సీఏ స్పాట్‌లైట్ అవార్డు … 2022 సంవత్సరానికి గాను ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం జ్యూరీకి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు అంతా ఈ వార్తను వైరల్ చేస్తూ మూవీ టీం కి విషెస్ తెలుపుతున్నారు.

Exit mobile version