Site icon Prime9

Bubble Gum Movie : రాజీవ్ కనకాల, సుమ కొడుకు రోషన్ “బబుల్ గమ్” మూవీ టీజర్ రిలీజ్..

roshan kanakala Bubble Gum Movie teaser released by natural star nani

roshan kanakala Bubble Gum Movie teaser released by natural star nani

Bubble Gum Movie : యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబంలో అందరవ్వవ సుమ కి ఫ్యాన్స్ గా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ. కాగా సీరియల్స్ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సుమ… దాదాపు 15 ఏళ్లుగా తన యాంకరింగ్ తో అలరిస్తుంది. సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నారు.

తాజాగా ఇప్పుడు వీరి కుమారుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు ‘బబుల్ గమ్’ అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల సరసన మనసా చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. నాని విడుదల చేసిన ‘బబుల్ గమ్’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో రోషన్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాలోనే హీరోయిన్ కి ఏకంగా ఘాటుగా లిప్ లాక్ కూడా ఇచ్చేశాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

 

Exit mobile version