Site icon Prime9

Rocketry: The Nambi Effect: జూలై 26నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’

Tollywood: ఆర్ మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ జూలై 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

ఈ చిత్రం 1994లో గూఢచర్యం కేసులో తప్పుడు ఆరోపణలపై జైలుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కించారు. తాను నిర్దోషిగా విడుదలయినా తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నారాయణన్ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.

ఈ చిత్రం జులై 1న ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం మరియు తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌లో సూపర్ స్టార్ సూర్య అతిధి పాత్రలో కనిపించగా, దాని హిందీ వెర్షన్‌లో షారుఖ్ ఖాన్ అదే పాత్రలో నటించారు. భారతదేశం, సెర్బియా, ఫ్రాన్స్, జార్జియా, రష్యా మరియు ఫ్రాన్స్ వంటి అనేక లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. రాకెట్రీని ట్రైకలర్ ఫిల్మ్స్ మరియు వర్గీస్ మూలన్ పిక్చర్స్ నిర్మించాయి

Exit mobile version