Prime9

Krishna Vrinda Vihari Movie Review: తెరపై కృష్ణ వ్రింద విహారిపై మ్యాజిక్… ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటూ రివ్యూ..!

Krishna Vrinda Vihari Movie Review: ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి వరుస హిట్స్‌తో యంగ్ హీరో నాగశౌర్య టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుని తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే ఆ తరువాత ఈ కుర్ర హీరోకు వరుస చిత్రాలు ఫ్లాప్ నిచ్చి నిరాశపరిచాయి. ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ద్వారా నేడు ప్రజల ముందుకు వస్తున్నాడు. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ షోస్ చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు. మరి వారి స్పందన ఎలా ఉందో ఓసారి చూసేద్దామా..!

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన కృష్ణ వ్రింద విహారి మూవీ స్టోరీ తెలిసినదే అయినా.. స్క్రీన్ ప్లే బాగుందని సినీ లవర్స్ రివ్యూ ఇస్తున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్.. కథను ఓ ములుపు తిప్పుతుందని చెప్తున్నారు. నాగశౌర్య ఎప్పటిలాగే తన కూల్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని.. హీరోయిన్ షిర్లీ సెటియా తెరపై మెస్మరైసింగ్ అందచందాలతో కనిపించిందంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ బాగున్నాయని.. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్కట్ అయిందని సినీ విశ్లేషకులు రివ్యూ ఇస్తున్నారు.

అయితే ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్లో స్టోరీ ఫ్లాట్‌గా సాగుతుందంటున్నారు. సినిమా కథ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదని ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి తెలుస్తోంది. మహతి స్వర సాగర్‌ సంగీతం కూడా చాలా బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఓవరాల్‌గా కృష్ణ వ్రింద విహారి మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ కాకపోయినా.. పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. ఒకసారి హాయిగా ఈ సినిమాను చూడొచ్చని అంటున్నారు.

ఇదీ చదవండి: Nikhil On RRR Movie: “ఆర్ఆర్ఆర్” కు “ఆస్కార్ సర్టిఫికేట్ అవసరమా”… హీరో నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Exit mobile version
Skip to toolbar